News July 18, 2024

రేపు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంత్రుల పర్యటన

image

రేపు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు ,తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలు ఖరారయ్యింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో అయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, 11:40కి మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకల్లో, 1 గంటలకు కరీంనగర్లోని ఓ కన్వెన్షన్లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Similar News

News February 15, 2025

శంకరపట్నం: తాటిచెట్టు పైనుంచి పడిన గీత కార్మికుడు

image

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కరీంపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం వీరాస్వామి శనివారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ తాటి చెట్టుపై కల్లు గీసి దిగుతుండగా కిందపడినట్లు స్థానికులు తెలిపారు. అతడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

News February 15, 2025

జగిత్యాల: Wow.. వెరైటీ పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డు

image

ఓ ఉపాధ్యాయురాలు తన పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డును వినూత్నరీతిలో తయారుచేశారు. జగిత్యాల(D) మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు రమ్య (శోభారాణి)-మురళి దంపతుల పెళ్లిరోజు ఈనెల 15న ఉంది. పెళ్లిరోజును శుభాకాంక్షల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చారు. ‘choose the correct answer’, ‘true or false’, ‘match the followings’ తో వెరైటీగా క్రియేట్ చేశారు. ఈ పెళ్లిరోజు శుభాకాంక్షల కార్డు పలువురిని ఆకట్టుకుంటుంది.

News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

error: Content is protected !!