News June 22, 2024
రేపు పెనుకొండకు మంత్రి సవిత రాక
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రేపు జిల్లాకు రానున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి జిల్లాకు వస్తున్నారు. ఉదయం 6.15 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి ఉ.9.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఉ.11 గంటలకు బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా పెనుకొండకు చేరుకుంటారు. నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సోమవారం తిరిగి విజయవాడ వెళ్లనున్నారు.
Similar News
News January 18, 2025
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం: కలెక్టర్
నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ అంకితభావంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు.
News January 17, 2025
సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
ఫిబ్రవరి 13, 14, 15వ తేదీల్లో సేవాఘడ్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రెవెన్యూ భవనంలో ఫిబ్రవరిలో గుత్తి పరిధిలో నిర్వహించే సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు.
News January 17, 2025
వీరుడా.. ఇక సెలవు
విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి (45) అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లిలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. అమర్రహే అంటూ ప్రజలు నివాళులర్పించారు.