News March 26, 2025
రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించనున్న చంద్రబాబు

రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం సీఎమ్ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా సీఎం పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు సీఎం చేరుకోనున్నారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
Similar News
News November 20, 2025
నేరస్థులను ప్రోత్సహించేలా జగన్ తీరు: వర్ల

హైదరాబాద్లో జగన్ ఆడిన ‘డ్రామా’, నటించిన తీరు వర్ణనాతీతం, చట్ట వ్యతిరేకమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన వ్యక్తి కాదన్నారు.

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.