News January 26, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

నంద్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే శాఖల జిల్లా అధికారులు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు.

Similar News

News December 2, 2025

ఏలూరు: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

image

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్‌కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ తమపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News December 2, 2025

ఖమ్మం: తొలిరోజే రూ.33 కోట్ల మద్యం విక్రయాలు

image

2025–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 204 వైన్ షాపుల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే వైరా ఐఎంఎల్ డిపో నుంచి ఏకంగా రూ.33 కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. ఇందులో 38,685 మద్యం కేసులు, 17,298 బీరు కేసులు ఉన్నాయి. నెల రోజులుగా బ్రాండ్లు లేక ఇబ్బంది పడిన మద్యం ప్రియులకు అన్ని రకాలు అందుబాటులోకి వచ్చాయి.

News December 2, 2025

తిరిగి విధుల్లోకి ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రకాశ్‌

image

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్స్‌ తీసుకున్న ఆయన సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నట్లు ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.