News January 26, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలచే వారి సమస్యలపై వినతి పత్రాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News February 14, 2025

2007 తర్వాత తొలిసారిగా లాభాల్లోకి BSNL

image

BSNL 2007 తర్వాత తొలిసారిగా లాభాల్ని చూసింది. ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో రూ.262 కోట్ల లాభం సంపాదించినట్లు ప్రకటించింది. ‘కొత్త ఆవిష్కరణలు, వినియోగదారుల సంతృప్తి, దూకుడుగా నెట్‌వర్క్ విస్తరణ వంటివి లాభాలకు దోహదం చేశాయి. ఖర్చులు తగ్గించుకోవడం కూడా లాభించింది. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లాభాలు 20శాతం దాటొచ్చని అంచనా వేస్తున్నాం’ అని సంస్థ సీఎండీ రాబర్ట్ జే రవి తెలిపారు.

News February 14, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News February 14, 2025

సంగారెడ్డి: విద్యాశాఖ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

image

విద్యాశాఖ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధికారులతో ఎంఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలకు విడుదలైన నిధులపై సమీక్షించి అందరూ ప్రధానోపాధ్యాయులు ఆ నిధులను వంద శాతం ఖర్చు చేయాలని, మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

error: Content is protected !!