News February 2, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై వినతులు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News November 20, 2025

పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

image

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.

News November 20, 2025

తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

image

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్‌ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.

News November 20, 2025

జగిత్యాల జిల్లాకు జీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం

image

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు అధికారులను నియమించింది. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడినిగా పి. వెంకట్ రెడ్డిని, వ్యయ పరిశీలకుడినిగా ఎం. మనోహర్‌ను నియమిస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.