News April 13, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ఈనెల 14 సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావడంతో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 7, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 7, 2025
HYD: జుట్టు ఊడుతోందా? మీకోసమే!

నగరవాసులకు ఒత్తైన జుట్టు కలగా మారుతోంది. మనోళ్లని హెయిర్లాస్, చుండ్రు తీవ్రంగా వేధిస్తున్నాయి. 30ఏళ్లలోపు 60% మందికి బాల్డ్హెడ్, 30% మందికి జట్టురాలుతోందని ఓ సర్వే వెల్లడించింది. ఒత్తిడి, హార్డ్ వాటర్కు VIT-D, VIT-B12 లోపాలు తోడవుతున్నాయి. VIT-D కణాలు ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. ఎండతగలకుండా ఉదయాన్నే ఆఫీస్కు చేరుకునేవారిలో VIT-D లోపం, మూడ్ స్వింగ్స్, బరువుపెరుగుదల ఉంటాయని వివరించింది.
News December 7, 2025
తిరుపతి: లైంగిక వేధింపులు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతిపై లైంగిక వేధింపులు విషయంలో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో NSU అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేసింది. కాగా..యువతి ఇచ్చిన ఫిర్యాదు కాపీలో సైతం లక్ష్మణ్ కుమార్ ఇబ్బంది పెట్టినట్లు ఉంది తప్ప ఎక్కడా గర్భవతి అయినట్లు కేసులో లేదు.


