News September 10, 2024

రేపు ప.గో జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

ప.గో జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఆకివీడు పట్టణంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారని కూటమి నాయకులు తెలిపారు.

Similar News

News January 3, 2026

ప.గో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీతారాం

image

పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అంకెం సీతారాం నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న సీతారాంను జిల్లా పగ్గాలు వరించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News January 3, 2026

తాడేపల్లిగూడెంలో కొట్టుకు చెక్..?

image

తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొట్టు సత్యనారాయణపై అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలు జగన్‌ను కలిశారని ప్రచారం సాగుతోంది. సర్పంచ్‌లు, ఎంపీపీలు పార్టీని వీడటంతో వడ్డీ రఘురామ్‌కు బాధ్యతలు అప్పగించాలని వారు కోరినట్లు సమాచారం. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు టాక్. త్వరలోనే వడ్డీ రఘురామ్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గుసగుసలు.

News January 3, 2026

భీమరం: అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

image

సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలో సంక్రాంతి సంబరాలను డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ భోగి మంటలు వేసి ప్రారంభించారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.