News September 28, 2024
రేపు బర్కత్పురకు కేంద్రమంత్రి బండి సంజయ్ రాక

బర్కత్పురలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు జరిగే ‘ బయోగ్రఫీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్రమోదీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు తదితరులు వస్తున్నారని పార్టీ నేత కేశబోయిన శ్రీధర్ తెలిపారు.
Similar News
News November 23, 2025
GHMCకి ఇదే ఆఖరు.. ఏం జరుగుతుందో?

GHMC పాలక మండలి సమావేశం ఈ నెల 25న జరుగనుంది. పాలకమండలి గడువు త్వరలో ముగియనుండటంతో ఇదే చివరి సర్వసభ్య సమావేశం అని తెలుస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏమేం అంశాలపై మాట్లాడాలో అజెండా తయారు చేసుకుంటున్నారు. ఈలలు, కేకల మధ్య సభ్యులందరితో ఫొటో సెషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే సభ్యులందరికీ సమాచారం అందింది. మరి సమావేశం వాడి.. వేడిగా జరుగుతుందా.. లేక ఆహ్లాద వాతావరణం నెలకొంటుందా అనేది చూడాలి.
News November 23, 2025
HYD: బస్సెందుకు మామా.. బండిపై పోదాం!

సిటీ బస్ ఎందుకు మామా.. బైక్ ఉంది కదా దానిపై పోదాం అని అంటున్నారు పురుషులు. నగరంలో బస్ ఎక్కే పురుషుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు ఈ గణాంకాలే సాక్ష్యం. సిటీలో రోజూ 2,850 బస్సుల్లో 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 18.5 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉండగా పురుషులు కేవలం 7.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలు చాలు పురుషులు బస్లో వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుసుకోవడానికి.
News November 23, 2025
గుడ్ న్యూస్.. DEC 1 నుంచి PhD ఇంటర్వ్యూలు

JNTUలో PhD ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం వర్సిటీ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెల 1 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. 8వ తేదీ వరకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఒక్క ఆదివారం మినహాయిస్తే మిగతా రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ విషయం గమనించి హాజరుకావాలని సూచించారు.


