News March 18, 2025
రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

వైసీపీఅధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
Similar News
News November 15, 2025
అమరావతిలో ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ స్టేడియం

రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్‌తో AIFF ఛైర్మన్ కళ్యాణ్ చౌబే భేటీ అయ్యారు. అమరావతిలో 12 ఎకరాల్లో AIFF ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం ప్రారంభించనున్నట్టు చౌబే వెల్లడించారు. గ్రాస్రూట్స్ ఫుట్‌బాల్ కోసం పీఈటీలకు శిక్షణ, కోచ్‌ల గ్రేడింగ్‌లో APతో భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు.
ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డీఎస్సీలో 3% రిజర్వేషన్ ఇచ్చామని లోకేశ్ ఆయనకు తెలిపారు.
News November 15, 2025
వీధుల పాలైన బాల్యం.. కూటి కోసం భుజాలపై చెత్త భారం.!

పుస్తకాల సంచితో బడికి వెళ్లాల్సిన బాల్యం నేడు వీధుల పాలైంది. గుంటూరు నగర వీధుల్లో శనివారం కనిపించిన దృశ్యం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా, పసి వయసులోనే కొందరు చిన్నారులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. బాలల హక్కుల గురించి ఎన్ని చట్టాలు ఉన్నా, పట్టపగలే నగరంలో ఇలాంటి బాలకార్మిక దృశ్యాలు కనిపించడం ఆవేదన కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
News November 15, 2025
GNT: నేడు ఘట్టమనేని శివరామకృష్ణ వర్ధంతి

గుంటూరు (D) బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న, ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు.1965 తేనె మనసులు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. తేనె మనసులు హిట్ అవడంతో, అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి సూపర్ స్టార్‌గా ఎదిగారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇలా ఎన్నో హిట్ సినిమాలతో 350పై చిలుకు సినిమాలు చేసి అగ్ర హీరోల సరసన నిలిచారు. 15 నవంబర్ 2022న తుది శ్వాస విడిచారు.


