News October 27, 2024
రేపు బిక్కనూర్ పట్టణ బంద్

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సోమవారం బిక్కనూర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చినట్లు హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. పట్టణంలో గల అన్ని వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఆటో డ్రైవర్లు సైతం బంద్లో పాల్గొనాలని సూచించారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 19, 2025
నిజామాబాద్: 3,500 ఎకరాలల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్

లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగుకు తగు సూచనలు చేశారు.
News October 19, 2025
నిజామాబాద్: ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేసుకోవాలి: కలెక్టర్

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటనే అన్ లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుద్రూర్, పొతంగల్, కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి తనిఖీ చేశారు.
News October 18, 2025
NZB: దరఖాస్తులకు నేడే చివరి తేదీ

NZB జిల్లాలో మద్యం టెండర్లకు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 102 మద్యం దుకాణాలకు శుక్రవారం వరకు 1419 దరఖాస్తుల స్వీకరించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్లో 492, బోధన్ 299, ఆర్మూర్ 260, భీమ్గల్ 171 దరఖాస్తులు వచ్చాయన్నారు. శనివారంతో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. చివరి రోజు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.