News March 28, 2025

రేపు భద్రకాళి ఆలయంలో ఒడిశాల బియ్యం వేలం

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిశాల బియ్యాన్ని ఈ నెల 29న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు ధరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం భద్రకాళి దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 26, 2025

HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

image

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<>HOCL<<>>)లో 72 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ, BSc, డిప్లొమా, ITI అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.hoclindia.com/

News November 26, 2025

SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

image

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 26, 2025

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

image

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.