News March 9, 2025

రేపు భద్రాద్రి కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కొత్తగూడెం: ప్రజాసమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News March 10, 2025

BREAKING: తాండూరులో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్ పరిధి కరణ్‌కోట్ హెడ్ కానిస్టేబుల్ రాంచందర్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తాండూరు పట్టణం సీతారాంపేట్‌కు చెందిన రాంచందర్ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. గతంలో తాండూరు డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చనిపోయారు. 

News March 10, 2025

శంషాబాద్: విమానానికి తప్పిన ప్రమాదం

image

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్ ఈరోజు ఉదయం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా వైజాగ్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ సిద్ధమయ్యాడు. అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి, అప్రమత్తమై గాల్లోకి లేపడంతో పెను ప్రమాదం తప్పింది.

News March 10, 2025

యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

image

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.

error: Content is protected !!