News February 9, 2025

రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో అర్జీలు సమర్పించేవారు తమ అంశాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు.

Similar News

News February 8, 2026

పార్వతీపురం: స్కూల్లో ఏంటీ సంస్కృతి?

image

పార్వతీపురం జిల్లా కురుపాం మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల ముందు అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. ఈ వీడియోని చూసిన వారంతా ఏంటీ సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. సంబంధిత ఉపాధ్యాయుడు హిజ్రాలను ఆహ్వానించి డ్యాన్సులు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

News February 8, 2026

రాజాసాబ్ OTT: మారుతిని రఫ్పాడిస్తున్నారు!

image

రెబల్ ఫ్యాన్స్ మరోసారి డైరెక్టర్ మారుతిని ఆడుకుంటున్నారు. OTTలో రాజాసాబ్ స్ట్రీమ్ అవుతుండటంతో, అందులోని తప్పులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో చాలాచోట్ల ప్రభాస్ డూప్‌ను వాడారని తెలిసిపోయిందని స్క్రీన్ షాట్స్‌తో ట్రోల్ జరుగుతోంది. బస్ జర్నీలో హీరోకు గడ్డం ఉండి, దిగేసరికి ట్రిమ్ అయిందని, బస్సే మారిందని, ఆస్తి పొందిన కనకరాజు(సంజయ్‌దత్‌) ఎందుకు పారిపోవాలనే ప్రశ్నలతో రఫ్పాడిస్తున్నారు.

News February 8, 2026

ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి.. రూ.500 కోట్ల మోసం!

image

ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి ఘరానా మోసం చేశారో కంపెనీ CEO. గురుగ్రామ్‌(హరియాణా)లో ప్రాజెక్టు చేపట్టానని, నెలవారీ ఆదాయం ఉంటుందని ఇన్వెస్టర్లను ‘32nd Avenue’ CEO ధ్రువ్ దత్ శర్మ నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి ₹కోట్లు తీసుకున్నారు. రిటర్న్స్ అడిగితే చేతులెత్తేశారు. బాధితుల ఫిర్యాదుతో ఫ్రాడ్ బయటపడింది. ధ్రువ్ ₹500 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు. వెయ్యి మంది బాధితులున్నారని తెలిపారు.