News February 14, 2025
రేపు భద్రాద్రి జిల్లా కోర్టులో లోక్ అదాలత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ప్రజలు తమ కేసులను రాజీ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి ప్రకటనలో తెలిపారు. కోర్టులో పెండింగ్లో ఉన్న వివిధ రకాల కేసులను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒక మంచి అవకాశం అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 20, 2025
NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
News October 20, 2025
దీపాలు వెలిగించేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆనందకరమైన దీపావళి పండగను జరుపుకొనే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. దీపాలకు తగులుతాయి అనుకున్న కర్టెన్లను వీలైతే కొన్నిరోజుల పాటు తీసి పక్కన పెట్టేయండి. దుస్తులు దీపాలకు అంటకుండా చూసుకోవాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. పిల్లలు బాణసంచా కాలుస్తుంటే పక్కనే పెద్దవాళ్లు ఉండాలి. టపాసులు కాల్చేటపుడు షూ, కళ్లజోడు ధరించాలి. కాకర్స్ను దీపాలకు దూరంగా పెట్టుకోవాలి.