News January 18, 2025
రేపు భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.45 నిమిషాలకు భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. అనంతరం మీనా నగర్ కాలనీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా పార్ధివ దేహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:45కు బయలుదేరి 2గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Similar News
News November 16, 2025
మిర్యాలగూడకు మంత్రులు..ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

మిర్యాలగూడలో సోమవారం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు.
News November 16, 2025
NLG: బస్టాపుల వద్ద బస్సులు ఆపరా?

నల్గొండ జిల్లాలో బస్టాపుల వద్ద, రిక్వెస్ట్ స్టాప్ల వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆపాల్సిన స్టేజీల్లో బస్సు ఆపకుండా కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రయాణికులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
News November 16, 2025
NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.


