News August 18, 2024
రేపు మంచిర్యాల జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్
రేపు మంచిర్యాల జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. హాజీపూర్ మండలం పడ్తనపల్లి పంచాయతీ పరిధిలోని రాంపూర్ చొక్కారాంనగర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షుడు మాధవరపు వినయ్ ప్రకాశ్ రావు వెల్లడించారు.
Similar News
News September 15, 2024
ఆదిలాబాద్: పట్టుదలతో మూడు ప్రభుత్వ కొలువులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పొచ్చన-రూప దంపతుల కుమారుడు సాయికృష్ణ పట్టుదలతో చదివి మూడు ప్రభుత్వ కొలువులు సాధించాడు. 2018లో గ్రూప్-4 పరీక్షలో సత్తాచాటి, ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2022లో మళ్లీ గ్రూప్-4 పరీక్ష రాసి ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం నిర్వహించిన పరీక్ష ఫలితాలలో అసిస్టెంట్ ఎనలైటిక్ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యాడు.
News September 15, 2024
కాసిపేట: విద్యార్థులతో నిద్రించిన జిల్లా కలెక్టర్
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కాసిపేట మండలం మలకపల్లిలోని ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిసరాలు, విద్యార్థులు నిద్రించే గదులు, వంటశాల, రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసిన అనంతరం అక్కడే నిద్రించారు.
News September 15, 2024
కడెం ప్రాజెక్టు ప్రస్తుత వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 700.125 అడగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 2,111 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు.