News February 28, 2025
రేపు మంత్రాలయానికి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్ రేపు మంత్రాలయం రానున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆయన వస్తుండటంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంగణం, గెస్ట్ హౌస్, ఆలయ ప్రాంగణాన్ని ఎస్పీ పరిశీలించారు. లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News March 1, 2025
విద్యార్థులపై కూలిన వృక్షం.. ఏడుగురికి గాయాలు

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో సైన్స్ దినోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శుక్రవారం సాయంత్రం ఓ భారీ వృక్షం కూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థినులు గాయపడ్డారు. వారికి స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ఎంపీడీవో రాణెమ్మ ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 1, 2025
కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST
News March 1, 2025
టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కర్నూలు కలెక్టర్

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.