News January 11, 2026
రేపు మదనపల్లిలో స్పందన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు సోమవారం మదనపల్లిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక DSP కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ సమస్యలకు సంబంధించిన అర్జీతో మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు సూచించారు.
Similar News
News January 14, 2026
పసిడిని మించిన ప్రసాదం.. మేడారం ‘బంగారం’

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంటేనే మనకు గుర్తొచ్చేది ‘బంగారం’. ఇక్కడ బంగారం అంటే పసిడి కాదు.. సాక్షాత్తు బెల్లం. రాబోయే జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మహా జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లకు సమర్పించే అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం ఇదే. భక్తులు తమ బరువును తూచుకొని తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీన్నే ‘నిలువెత్తు బంగారం’ అంటారు.
News January 14, 2026
3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి 3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 గంటలకు మధిర చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజలతో భేటీ అవుతారు. గురువారం సంక్రాంతి వేడుకల్లో పాల్గొని, శుక్రవారం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కావున అధికారులు, కార్యకర్తలు గమనించి డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ కోరారు.
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


