News September 18, 2024

రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

image

ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్‌ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

Similar News

News December 21, 2025

ANU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 2వ ఏడాది రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి నిర్వహిస్తామని..ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29లోపు, రూ.100 ఫైన్‌తో 30లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.

News December 20, 2025

మంగళగిరి: 79వ రోజు మంత్రి లోకేశ్‌ ‘ప్రజాదర్బార్’

image

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. RTCలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని బాధితులు కోరగా, సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

News December 20, 2025

జర్నలిస్టుల సెమినార్‌కు వస్తా: మంత్రి లోకేశ్‌

image

APUWJ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించే సెమినార్‌కు హాజరవుతానని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని జర్నలిస్టుల బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.