News December 15, 2024

రేపు మహబూబాబాద్‌లో జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

image

మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జిల్లా జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలురు 20ఏళ్లలోపు, 70 కేజీలలోపు బరువు ఉండాలని, బాలికలు 65 కేజీలలోపు బరువు కలిగి ఉండాలన్నారు. ఇక్కడ ఎంపికైన జట్లు ఈనెల 27, 28, 29, 30వ తేదీల్లో జనగామ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్షిప్‌లో పాల్గొంటారన్నారు.

Similar News

News November 27, 2025

వరంగల్: ఏడాది గడిచినా వేతనాలు అందని దుస్థితి!

image

ఇంటింటి కుటుంబ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు వేతనాలు అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 1.79 లక్షల కుటుంబాలపై 1200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి దరఖాస్తుకు రూ.30 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా చెల్లింపులు నిలిచిపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 27, 2025

వరంగల్: సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం నిఘా!

image

ఎన్నికల పారదర్శకత కోసం వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. 5వేల పైబడిన గ్రామాల్లో సర్పంచ్ ఖర్చు రూ.2.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ.50 వేలుగా, 5వేల లోపులో సర్పంచ్‌కు రూ.1.5 లక్షలు, వార్డులకు రూ.30 వేలుగా పరిమితులు నిర్ణయించారు. మండల కేంద్రాల్లో క్లస్టర్లు ఏర్పాటై, అభ్యర్థులు సంబంధిత పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చని చెప్పారు.

News November 27, 2025

WGL: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: ఎస్‌ఈసీ

image

రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి పాల్గొన్నారు.