News January 25, 2025

రేపు మాంసం దుకాణాలు బంద్: కమిషనర్

image

రేపు రామాయంపేట మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు జరపొద్దని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు మూసివేయాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్‌ ఉండనున్నాయి.

Similar News

News February 16, 2025

శివంపేట: చోరీ కేసులో నలుగురు అరెస్టు

image

శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామ శివారులోని భవ్యస్ ఫార్మసిటికల్ కంపెనీలో ఈనెల 15న జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో అర్ధరాత్రి వేళ ఇనుప సామాగ్రి చోరి చేయగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన వెంకటేష్, ఆంజనేయులు, బ్రహ్మచారి, ధర్మేందర్లను అరెస్ట్ చేసి డిమాండ్‌కు తరలించారు.

News February 16, 2025

మెదక్: సాంఘిక సంక్షేమ కళాశాలను సందర్శించిన కలెక్టర్

image

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో మెనూ పగడ్బందీగా అమలు చేయడం హర్షనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ రైల్వే స్టేషన్ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించారు. ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

News February 16, 2025

హెల్ప్ డెస్క్ ద్వారానే వినతుల స్వీకరణ: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 17 సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వినతులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.

error: Content is protected !!