News December 15, 2024

రేపు మీకోసం కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం రేపు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. కావున జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News January 14, 2025

ఏలూరుకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య

image

తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 14, 2025

ప.గో: మొదటిరోజు..100 కోట్లు పైనే..

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం భోగి రోజు కోడిపందాలు జోరుగా సాగాయి. పక్క రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు పాల్గొని పెద్ద ఎత్తున పందాలు కాశారు. పందాల పేరిట కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి. మొదటిరోజు కోడిపందాలు, గుండాట, పేకాటల ద్వారా సుమారు రూ.100 కోట్ల రూపాయలు పైనే చేతులు మారినట్లుగా అంచనా.

News January 13, 2025

సంక్రాంతికి వస్తున్నారా..ఇవి మిస్ కావద్దు

image

పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం నుండి సంక్రాంతి సందడి మొదలైపోతుంది. పండుగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అలా వచ్చేవారు సంక్రాంతి మూడు రోజులు ఈ ప్లేస్‌లు మాత్రం మిస్ కావద్దు. భీమవరం మావుళ్ళమ్మ జాతర, భీమవరం, పాలకొల్లు, మొగల్తూరులో జరిగే సంక్రాంతి సంబరాలు, పేరుపాలెం బీచ్‌లో, నరసాపురం వణువులమ్మ జాతర.