News November 9, 2024

రేపు మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి అంత్యక్రియలు

image

బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి అంత్యక్రియలను ఆదివారం మెట్‌పల్లిలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆమె పార్థివదేహాన్ని ప్రత్యేక చార్టెర్డ్ విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం చేరుకోనుంది. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా రాత్రి వరకు మెట్‌పల్లి చేరుకుంటుందన్నారు.

Similar News

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ప్రధానాంశాలు

image

☞ పంచాయతీ అవార్డు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్
☞ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న సీఎం క్రికెట్ కప్
☞ గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కరీంనగర్ కలెక్టర్
☞ హుస్నాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతా జయంతి వేడుకలు
☞ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
☞ ఎల్కతుర్తి: పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

News December 11, 2024

KNR: గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.

News December 11, 2024

సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ

image

సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12  నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.