News December 29, 2024

రేపు యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.

Similar News

News January 24, 2025

అయినవిల్లి: యువతి కిడ్నాప్.. కేసు నమోదు 

image

అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన పదహారేళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన దింపు కార్మికుడు సాయి బుధవారం రాత్రి తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దింపులు తీసేందుకు వచ్చిన సాయి స్థానికంగా ఉంటూ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.

News January 24, 2025

అమలాపురం: హారన్ కొట్టాడని యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్టు

image

హారన్ కొట్టాడన్న కారణంతో యువకుడిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశామని అమలాపురం టౌన్ సీఐ వీరబాబు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఆనందరావు, సురేశ్, సత్యనారాయణను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించిందన్నారు. వారిని కొత్తపేట సబ్ జైలుకు తరలించామన్నారు. సవరప్పాలానికి చెందిన యువకుడు దుర్గాప్రసాద్‌పై ఈదరపల్లి వంతెన వద్ద యువకులు దాడికి పాల్పడ్డారన్నారు.

News January 23, 2025

తూ.గో: కుంభమేళాకు వెళ్లే భక్తులకు శుభవార్త

image

ఉమ్మడి తూ.గో. జిల్లా నుంచి కుంభమేళాకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ, రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1,4,8 తేదిల్లో కొవ్వూరు, రాజమహేంద్రవరం నుంచి వారం రోజుల యాత్రలో భాగంగా పూరి-కోణార్క్, ప్రయాగ్ రాజ్, కుంభమేళా, వారణసి, బుద్ధగయ, కాశీ తదితదర క్షేత్రాల దర్శనానికి ఒక్కోక్కరికి రూ.10 వేలు టికెట్‌తో మూడు బస్సులను ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నారు.