News February 22, 2025
రేపు యాదగిరిగుట్టలో బ్రేక్ దర్శనాలు బంద్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం ఉ. 11:45 గంటలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిత్య ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కొండపైట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Similar News
News December 8, 2025
విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు ఇవాళ ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.
News December 8, 2025
వెంకటాపూర్: సర్పంచ్ పోరు.. ఇదే ప్రత్యేకత..!

మరికల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నుంచి విజయ్ కుమార్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఈ పంచాయతీ జనరల్కు కేటాయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయకుమార్ తల్లి కళావతమ్మ, బీఆర్ఎస్ నుంచి రాజేందర్ రెడ్డి తల్లి అనితలు పోటీ చేశారు. గత ఎన్నికల్లో కళావతమ్మ విజయం సాధించారు. మరి ఈ ఎన్నికల్లో ఎవ్వరిని విజయం వస్తుందో ఈనెల 14న తెలుస్తుంది.
News December 8, 2025
నిర్మల్: వాతావరణ శాఖ హెచ్చరిక

జిల్లాలో రాబోయే రోజుల్లో చలిగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13వ తేదీల మధ్య ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపారు. జిల్లా వాసులు సాయంత్రం తర్వాత తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.


