News April 25, 2024
రేపు రాజంపేటకు పవన్, చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గురువారం రాజంపేటకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, రైల్వేకోడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇద్దరు హెలికాప్టర్‌లో తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జిల్లాకు పవన్, చంద్రబాబు కలిసి రానుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో పాల్గొననున్నారు.
Similar News
News February 14, 2026
ప్రొద్దుటూరు: పెట్రోల్ బంక్ స్కాంలో చెక్ బౌన్స్ కేసు.?

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. వీటిపై చెక్ బౌన్స్ కేసు పెట్టనున్నారు. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ బకాయిలకు సంబంధించి సుమారు రూ.50 లక్షల విలువైన 10 చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశాడు. ఈ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ తెలిపారు. పెట్రోల్ బంక్ బకాయిలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపామని కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు.
News February 14, 2026
ప్రొద్దుటూరు: నెహ్రూ రోడ్డులో దారుణ హత్య

ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్డులో శుక్రవారం రాత్రి సుబ్బు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బు బేల్దారి పని చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. సుబ్బు, వినయ్ మద్యం తాగి గొడవ పడినట్లు, ఈ గొడవ హత్య వరకు వెళ్లిన్నట్లు సమాచారం. 3వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2026
రేపు కడపకు రానున్న వైఎస్ షర్మిల

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆమె రేపు కడప నగరంలో పర్యటిస్తారు. రాత్రికి ఇడుపులపాయ చేరుకొని రేపు ఉదయం కడప నగరంలోని యానాది కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు


