News July 29, 2024

రేపు రెండో విడత రైతు రుణమాఫీ విడుదల: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ప్రభుత్వం ఈనెల 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల, రైతుల, అధికారుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. రైతులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

Similar News

News November 6, 2025

10న ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక ఎంపిక పోటీలు

image

జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ మహిళల, పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ బాన్సువాడలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు N.V. హన్మంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఫిజికల్ డైరెక్టర్ సురేందర్‌ను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

image

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.

News November 5, 2025

రాజకీయ పార్టీలకు బూత్ లెవల్ ఏజెంట్లు: నిజామాబాద్ కలెక్టర్

image

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్‌లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.