News March 7, 2025
రేపు వనపర్తికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వనపర్తి పట్టణ స్థానిక సమస్యలపై అధ్యయనం చేసేందుకు శనివారం వనపర్తికి వస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు తెలిపారు. ప్రజా సమస్యలను పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి మార్చి చివరి దాకా సమస్యలపై సర్వేలు, ఆందోళనలు జరుగుతాయన్నారు.
Similar News
News December 1, 2025
WGL: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 294 మద్యం షాపులకు టెండర్లను పిలవగా, 10,493 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.314.79 కోట్ల ఆదాయం జమ అయ్యింది. కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మేడారం జాతర కలిసి వచ్చేలా చేసింది.
News December 1, 2025
అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. అయితే కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతలు కోస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
GNT: నూతన HIV చికిత్స.. బిడ్డకు సోకే ప్రమాదం తగ్గింపు.!

సెప్టెంబర్, 2012 నుంచి జిల్లాలో HIV సోకిన ప్రతి గర్బిణికి 14వ వారము నుంచి నూతన చికిత్స విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తద్వారా బిడ్డకు HIV వచ్చే అవకాశం తగ్గుతుంది. అటు ఈ సంవత్సరం గుంటూరు, తెనాలిలోని సుఖవ్యాధి చికిత్సా కేంద్రాల నుంచి 4,785 మంది సుఖవ్యాధులు సోకినవారు చికిత్స పొందారు. జిల్లాలో షిప్ పాజిటివ్, హ్యాపెన్ సంస్థ, లయన్స్ క్లబ్, ల్యాంప్, రాజీవ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.


