News November 22, 2024
రేపు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఓటర్ డ్రాఫ్ట్

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటరు డ్రాఫ్ట్ను శనివారం ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ జాబితా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వద్ద పరిశీలన కోసం అందుబాటులో పెట్టనున్నట్లు తెలిపారు.
Similar News
News December 17, 2025
ఎంజీఎం వార్డులోకి కుక్క.. ఇద్దరికి షోకాజ్ నోటీసులు

వరంగల్ MGM ఆసుపత్రిలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. గతంలో ఎలుకలు కొరికిన ఘటన జరిగిన అదే వార్డులోకి తాజాగా ఒక కుక్క ప్రవేశించడం కలకలం రేపింది. రోగి బంధువులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేయడంతో విధుల్లోని ఇద్దరు సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల వైఫల్యానికి తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 15, 2025
వరంగల్: ఇక ప్రాదేశిక స్థానాలపై కన్ను..!

జిల్లాలో రెండు విడుతల గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో చివరి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. కాగా, నాయకులు ప్రాదేశిక స్థానాలపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, రిజర్వేషన్ అనుకూలించని వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలను చేపట్టారు. ప్రాదేశిక స్థానాలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
News December 15, 2025
గీసుగొండలో కొండా వర్గం పాగా!

పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా వీడిపోయిన విషయం తెలిసిందే. గీసుగొండ మండలంలో 21 పంచాయతీల్లో రెండు ఏకగ్రీవం కాగా, మిగిలిన 19 పంచాయతీల్లో 7 పంచాయతీలకు కొండా వర్గం గెలిచింది. 3 బీఆర్ఎస్, 1 స్వతంత్ర, 8 రేవూరి కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. వాస్తవానికి కాంగ్రెస్ 15 పంచాయతీలు గెలిచినట్టు. రెండు వర్గాల ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్కు డ్యామేజీ అయ్యింది.


