News May 26, 2024
రేపు వరంగల్ జిల్లాలో 144 సెక్షన్ అమలు

ఈనెల 27న జరిగే వరంగల్–నల్గొండ–ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
Similar News
News February 13, 2025
వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 13, 2025
పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలి: పీటీసీ ప్రిన్సిపల్

పోలీసులు విధి నిర్వహణలోని మంచి పేరు తెచ్చుకోవాలని మామునూర్ పీటీసీ ప్రిన్సిపల్ పూజ అన్నారు. బుధవారం మామునూర్ క్యాంప్‌లో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన 256 కానిస్టేబుళ్ల శిక్షణకు పూజ హాజరై మాట్లాడారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న ప్రతి విషయం విధి నిర్వహణలో తోడ్పాటు కాగలదని, చెప్పారు. డీఎస్పీలు రమేష్, వేంకటేశ్వర రావు, రవీందర్, పాండునాయక్, పీఆర్‌ఓ రామాచారి పాల్గొన్నారు.
News February 12, 2025
ముగిసిన రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు

వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిరాటంకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించారు.