News April 10, 2024
రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

5రోజుల సుదీర్ఘ విరానంతరంమం అ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం పున:ప్రారంభం కానుంది. శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, సోమవారం అమావాస్య, నేడు ఉగాది నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
Similar News
News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
News March 26, 2025
నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాత ఆజంజాహీ మిల్ గ్రౌండ్లో 16.7 ఎకరాలలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న జీ ప్లస్ టూ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News March 26, 2025
వరంగల్: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

మామూనూర్ ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనుల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యాచరణ ప్రణాళిక పురోగతిపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు, భూముల అవార్డింగ్ పాస్ అయిన వారికి డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.