News January 15, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం
ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉ. 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News January 16, 2025
రెండు జాతరల్లో మెరుగైన వైద్య సేవలు: DMHO
హనుమకొండ జిల్లాలో జరుగుతున్న రెండు (ఐనవోలు, కొత్తకొండ) జాతరల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు DMHO డా.అల్లం అప్పయ్య తెలిపారు. ఐనవోలులో 50 మంది, కొత్తకొండలో 40 మంది వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు ANMలు, MNOలు ఆశాలు 3 షిఫ్టులలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొత్తకొండ జాతరలో 1,071, ఐనవోలులో 3,728 మందికి సేవలందించామన్నారు.
News January 15, 2025
గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఈరోజు ఉదయం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు.
News January 15, 2025
ఐనవోలు జాతరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన MLA
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఐనవోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.