News January 15, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం

ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉ. 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News February 11, 2025
శివరాత్రి సందర్భంగా అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈసారి చర్యలు చేపట్టాలన్నారు.
News February 11, 2025
BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
ఐనవోలు: పాడి పశువులపై మళ్లీ దాడి చేసిన హైనాలు!

HNK జిల్లా ఐనవోలు మండలంలోని గరిమెళ్లపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా పాడి పశువులపై హైనా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి మళ్లీ పొలం వద్ద ఉన్న ఎడ్లపై దాడి చేయడంతో కొమ్ములతో హైనాలను పొడవపోయాయి. ఈ క్రమంలో ఎడ్లకు పలుచోట్ల గాయాలు అయ్యాయి. పాక వద్ద పడుకున్న ప్రభాకర్ వివరాల ప్రకారం.. రెండు హైనాలు వచ్చాయి. తనపై కూడా దాడి చేయగా కర్రలతో బెదిరించినట్లు తెలిపాడు.