News April 6, 2025
రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకు మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 8, 2025
పోలింగ్ రోజున వరంగల్లో స్థానిక సెలవులు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
News December 8, 2025
వ్యవసాయ శాఖపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

వరంగల్ కలెక్టరేట్లో వ్యవసాయ శాఖపై కలెక్టర్ డా.సత్య శారద సమీక్ష నిర్వహించారు. యాసంగి 2025-26కి అవసరమైన విత్తనాలు, ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
News December 8, 2025
రాష్ట్రస్థాయి పోటీకి పర్వతగిరి, రోల్లకల్ పాఠశాలలు

పాఠశాలల్లో సకల సౌకర్యాలు కలిగి ఉన్న పాఠశాలల విభాగంలో రాష్ట్రస్థాయికి పర్వతగిరి జిల్లా పరిషత్ పాఠశాల, రోల్లకల్ యుపీఎస్ పాఠశాలలు ఎంపికయ్యాయి. హరిత ఏవం స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ (SHVR) జిల్లాస్థాయిలో 8 పాఠశాలల్లో ఒకటిగా నిలచి రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నాయి. మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్, పరిశుభ్రత తదితర విభాగాల్లో ఉత్తమంగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీల్లో నిలవడంతో ఎంఈఓ లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


