News September 10, 2024

రేపు విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న మెగా హీరో

image

ఈ నెల 11న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో పర్యటించనున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఉదయం 11గంటలకు సింగ్‌నగర్‌లోని అమ్మసేవ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తానని, అభిమానులు రావాలని కోరారు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన చెరో రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.

Similar News

News October 17, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండా అంశాలపై సమీక్షించిన కలెక్టర్, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News October 16, 2025

కృష్ణా: బెల్ట్ షాపుల్లో మద్యం సురక్షితమేనా.?

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్‌ ద్వారా వైన్ షాపులు, బార్‌లలో మద్యం సీసాల స్కానింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, బెల్ట్ షాపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని మద్యం ప్రియులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం మద్యం విక్రయిస్తున్న ఈ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న సీసాలు అసలువో, నకిలీవో తెలుసుకునే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 16, 2025

అంగలూరులో రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల

image

గుడ్లవల్లేరు అంగలూరు గ్రామంలో చల్లపల్లి జమిందార్ జ్ఞాపకార్థంగా బాలికల పాఠశాల ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందు బాలికలకు విద్య దూరంగా ఉండేది. దీంతో 1946లో ఈ స్కూల్ ప్రారంభించి బాలికా విద్యకు పునాది వేశారు. జమిందారీ దాతృత్వంతో 96 సంవత్సరాల అద్భుత ప్రయణం సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బాలికల ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇటీవల జిల్లాస్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకుంది.