News February 1, 2025

రేపు సంబేపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

image

రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లిలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.

Similar News

News November 22, 2025

రేపు గుంటూరులో బాబా శ‌త జ‌యంతి: కలెక్టర్

image

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌త‌ జ‌యంతి ఉత్స‌వాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జ‌యంతిని రాష్ట్ర‌స్థాయి పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని చెప్పారు. ఈ నేప‌థ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ స‌త్య‌సాయి సేవా స‌మితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

News November 22, 2025

ఖమ్మం: 1269వ మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

image

మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించే ‘వాక్ ఫర్ ట్రీస్’ కార్యక్రమం ఈరోజు ఖమ్మం వెలుగుమట్ల పార్కులో జరిగింది. ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ 1269వ మొక్కగా బాదం మొక్కను నాటారు. వనజీవి రామయ్య సినిమా బృందం సభ్యులు, పలువురు ప్రకృతి ప్రేమికులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఫారెస్ట్ అధికారులు పిలుపునిచ్చారు.

News November 22, 2025

ఇంద్రకీలాద్రిపై గురు భవానీల పేరుతో దందా..!

image

ఇంద్రకీలాద్రిపై వచ్చేనెల 11-15వ తేదీ వరకు భవాని మాల విరమణకు భక్తులు రానున్నారు. కాగా ఇప్పటినుంచే ఆలయాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోవాలని గురుస్వాముల ముసుగులో కొందరు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా మాలవిరమణ సమయంలో వీరిదందా ఎక్కువగా ఉంటోంది. మాల విరమణ, ఇరుముడి తీసేహక్కు లేకున్నా ఆ ఇరుముడిలో వచ్చే నగదుకై 5 రోజుల్లోనే రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు కట్టడి చేయాలని భవానీలు కోరుతున్నారు.