News February 1, 2025

రేపు సంబేపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

image

రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లిలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.

Similar News

News February 19, 2025

కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజ్రీవాల్

image

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

News February 19, 2025

KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు?: TPCC చీఫ్

image

TG: ఫాం హౌస్‌కి పరిమితమైన KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని, అధికారం కోసం గుంట నక్కలా ఎదురు చూసినా ఫలితం ఉండదని అన్నారు. ‘KCR పాలనకు INC పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి KCRకు సిగ్గు ఉండాలి. గతంలో మా MLAలను చేర్చుకున్నప్పుడు మీ సోయి ఎటు పోయింది’ అని మండిపడ్డారు.

News February 19, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

➔ASF జిల్లాలో 12 మంది రిమాండ్. ➔కెరమెరిలో రేషన్ బియ్యం పట్టివేత. ➔బెజ్జూర్ చిన్నారులను పాఠశాలలో చేర్పించాలి. ➔SKZR: శివాజీ చిత్రపటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్సీ. ➔దహేగాం: దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ➔రేపు కాగజ్ నగర్‌కు మంత్రి సీతక్క. ➔రెబ్బెన పోలీసులతో దురుసు ప్రవర్తన.. ఇద్దరికీ రిమాండ్.

error: Content is protected !!