News May 10, 2024
రేపు సాయంత్రం నుండి మద్యం షాపులు బంద్

ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ రాత్రి 10 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు.
Similar News
News December 4, 2025
రెండో విడత ఎన్నికలు.. 894 నామినేషన్లు ఆమోదం.!

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. 6 మండలాల్లో కలిపి సర్పంచ్లకు 894, వార్డులకు 4047 దాఖలైన నామినేషన్లను ఆమోదించినట్లు చెప్పారు. కామేపల్లి S-99 W-509, KMM(R) S-119 W-556, కూసుమంచి S-211 W-823, ముదిగొండ S-133 W-635, నేలకొండపల్లి S-133 W-640, తిరుమలాయపాలెం S-199 W-884 నామినేషన్లను ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు.
News December 4, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} రెండో రోజు మూడో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News December 4, 2025
తొలి విడత ఎన్నికలు.. 438 నామినేషన్ల ఉపసంహరణ

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో కలిపి సర్పంచ్లకు 438, వార్డులకు 556 మంది వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ నెల 11న జరిగే తొలి విడత ఎన్నికల్లో 7 మండలాల్లో కలిపి 192 స్థానాల్లో సర్పంచ్, 1740 స్థానాల్లో వార్డుల పదవికి ఎన్నికలు జరగనున్నాయి.


