News August 1, 2024

రేపు సాయంత్రం 4గంటలకు నాగార్జున సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్​ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

Similar News

News October 27, 2025

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

image

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 27, 2025

NLG: మైనర్‌పై అత్యాచారయత్నం.. నిందితుడికి పదేళ్ల జైలు

image

మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ నల్గొండ ఎస్సీ/ఎస్టీ, పోక్సో కేసుల కోర్టు తీర్పు వెలువరించిందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. తిప్పర్తి మండలం కేసరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులుకు ఈ శిక్ష పడింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

News October 27, 2025

NLG: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. దూరం నుంచి వచ్చే వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ రోజు మొత్తం 98 ఫిర్యాదులు అందాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.