News August 1, 2024

రేపు సాయంత్రం 4గంటలకు నాగార్జున సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్​ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

Similar News

News October 4, 2024

NLG: ఇతర ప్రాంతాల ధాన్యం కొనుగోళ్లకు చెక్

image

ఈ వానాకాలం ధాన్యం కొనుగోలులో భాగంగా ఎట్టి పరిస్థితులలో బయటి ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లాకు ధాన్యం రావడానికి వీల్లేదని అన్నారు. 2024- 25 వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అయిన ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

News October 4, 2024

ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వాడపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఈడుగు రవి, హాలియా ఎస్సై సతీష్ రెడ్డిలను నల్లగొండ ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ ఎస్సై రవీందర్, ఆత్మకూరు(ఎస్) ఎస్సై వై.సైదులు, తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలును ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు.

News October 3, 2024

నల్గొండ: ఈనెల 14 వరకు డీజేల వినియోగంపై నిషేధం: ఎస్పీ

image

నల్గొండ జిల్లా పరిధిలో ఈనెల 14 వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే DJలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించినట్లు ఎస్పీ వెల్లడించారు.