News October 18, 2024
రేపు సికింద్రాబాద్ బంద్

సికింద్రాబాద్ బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చారు. దుండగుడు సలీం ఠాగూర్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక వ్యాపారులు, ఉద్యోగులు, దుకాణదారులు సహకరించాలని కోరారు.
Similar News
News February 26, 2026
HYD: రూ.2వేల కోట్లతో ఆవుల పంపిణీ

రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు పశుసంవర్థకశాఖ రూ.2వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. HYD మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఏటా 830 మంది రైతులకు 2 చొప్పున ఆవులను సబ్సిడీపై అందించనున్నారు. మూడేళ్లలో మొత్తం 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్ ఖర్చు రూ.2,51,000గా అంచనా వేయగా 50% రైతు 50% సబ్సిడీ అందిస్తుంది.
News February 26, 2026
HYD: తల్లి మరణించినా ఎగ్జామ్‌కు హాజరు

HYD శివారు శంకర్‌పల్లిలో హృదయాన్ని కదిలించిందీ ఘటన. కేజీబీవీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కల్పన (40) మంగళవారం రాత్రి మరణించారు. బుధవారమే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, ఆమె కుమారుడు రవితేజ మాత్రం పరీక్షకు వెళ్లాలనుకున్నాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా.. పరీక్ష పూర్తి చేసి అనంతరం తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
News February 26, 2026
చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.


