News November 5, 2024
రేపు సోమాజిగూడలో సైబర్ సెక్యూరిటీ వార్షిక సమ్మిట్

సైబర్ భద్రతకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు సైబర్ సెక్యూరిటీ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో బుధవారం ఈ కార్యక్రమం జరగనుంది. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సైబర్ భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలను సమావేశంలో చర్చిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారన్నారు.
Similar News
News November 12, 2025
జూబ్లీహిల్స్: ప్రచారం ఫుల్.. పోలింగ్ నిల్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు వారాల పాటు ప్రధాన పార్టీలు ఫుల్ జోష్‌గా ప్రచారం చేశాయి. సీఎం సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల కీలక నేతల రోడ్ షోలు,ర్యాలీలు, డైలాగ్‌లు,మాటల తూటాలు, ఆరోపణలతో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ వేడెక్కాయి. అయితే ఇంత చేసినా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో అటు పార్టీలతోపాటు ఇటు ఎన్నికల అధికారులు వెనకబడ్డారు. 48.49% పోలింగ్ జరిగింది.
News November 12, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ VS BRS.. పోలీసులకు తలనొప్పి..!

ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం పలు చోట్ల ఉద్రిక్తల నడుమ సాగింది. కాంగ్రెస్, BRS నేతలు నువ్వానేనా అన్నచందంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నినాదాలు, నిరసనలు, బైఠాయింపులు, వాగ్వాదాలు, అరెస్ట్‌లతో పాటు చివరకు PSలలో పరస్పరం ఫిర్యాదులు చేసేదాకా ఇరు పార్టీల నాయకులు వెళ్లారు. దీంతో వీరి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారగా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేశారు.
News November 12, 2025
HYD: జావా కోడింగ్‌పై 4 రోజుల FREE ట్రైనింగ్

బాలానగర్‌లోని CITD కేంద్రంలో 4రోజుల జావా కోడింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వన్నున్నట్లు CDAC బృందం ప్రకటించింది. ఐటీఐ ఫ్యాకల్టీ, పాలిటెక్నిక్ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ STEM సబ్జెక్టులు బోధించే వారికి ఇది సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జావా కోడింగ్‌పై పట్టు సాధించాలని అనుకున్నవారు, నవంబర్ 20 సా.5 గంటలలోపు tinyurl.com/mvutwhub లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.


