News January 22, 2025
రేపు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

హుస్నాబాద్: పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని 15వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి హనుమాన్ గుడి సమీపంలో వార్డు సభలో పాల్గొననున్నారు. 2వ వార్డులో పోచమ్మ కమాన్ ప్రారంభించనున్నారు.
Similar News
News November 21, 2025
ఖమ్మంలో ఫుట్ పాత్‌ల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్‌ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై చర్చించారు. వైరా రోడ్డు, బైపాస్, ఇల్లందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్లకు ఫుట్ పాత్‌ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.
News November 21, 2025
సంగారెడ్డి: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాలకు గురైతే 48 గంటల్లో 1930, https://www.cybercrime.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 21, 2025
రేపు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్ష సూచన.!

దక్షిణ అండమాన్‌లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది.


