News September 16, 2024
రేపు ADBలో మద్యం దుకాణాలు మూసివేత

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 17న మంగళవారం మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు ఎవరైనా ఈ సమయాల్లో విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరిగి బుధవారం యథావిధిగా దుకాణాలు తెరుస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 11, 2025
ADB: రేపు జిల్లా స్థాయి హాకీ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు శిక్షకుడు రవీందర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.
News March 11, 2025
గుడిహత్నూర్‌లో శిశువు మృతదేహం కలకలం

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామ శివారులోని వాగులో మంగళవారం ఉదయం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.
News March 11, 2025
ADB: రూ.75.31లక్షల కరెంట్ బిల్లు పెండింగ్

జిల్లాలోని 447 పాఠశాలల్లో మొత్తం రూ.75.31 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. అవి పాత కరెంటు బిల్లులు కావడంతో చెల్లించలేదని, నిధులు మంజూరైనప్పటి నుంచి రెగ్యులర్ బిల్లు చెల్లిస్తున్నామని పలువురు HMలు వివరించారు. కాగా నెల రోజుల్లో బకాయిలు పూర్తి చేయకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.