News February 11, 2025

రేపు YCPలో చేరనున్న TDP మాజీ MLA కుమారుడు

image

మాజీ MLA గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీశ్ YCPలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 12న ఆయన YCP అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా ఈయన గత ఎన్నికల్లోనే నగరి నుంచి MLAగా పోటీ చేయాలని భావించినా పలు కారణాలతో అది వీలుపడలేదు.

Similar News

News October 23, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట చలి తీవ్రత ప్రభావం క్రమంగా పెరుగుతోంది. బిచ్కుంద మండలంలో 33.8 సెంటీగ్రేడ్ కాగా.. మద్నూర్ మండలంలో 33.6, పాల్వంచ 33,5, నస్రుల్లాబాద్‌ 33, బీర్కూర్ 32.8, అత్యల్పంగా రాజంపేట మండలంలో 30.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News October 23, 2025

జూరాలకు 15,241 క్యూసెక్కుల వరద

image

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. గురువారం ఉదయం ఇన్ ఫ్లో 15,241 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. పవర్ హౌస్‌కు 17,176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి కాలువకు 700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 46, బీమా లిఫ్ట్ -2 కు 783, మొత్తం 18,999 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

News October 23, 2025

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మహమ్మదాబాద్ మండలంలో 13.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హన్వాడ 13.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 4.8, గండీడ్ మండలం సర్కార్ పేట, దేవరకద్ర 3.8 , మహబూబ్‌నగర్ గ్రామీణం, భూత్పూర్ 3.3, జడ్చర్ల 3.0, నవాబుపేట మండలం కొల్లూరు 2.5, బాలానగర్ 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.