News March 26, 2025

రేపే ఉప ఎన్నికలు.. కూటమికి విజయం దక్కేనా.?

image

చిత్తూరు జిల్లా పరిధిలో బుధవారం MPP ఉప ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రామకుప్పం, తవణంపల్లి, సదుం, విజయపురం (వైస్ ఎంపీపీ), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి చూస్తోంది. సదుం సహా పలు చోట్ల YCP, కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు JC విద్యాధరి స్పష్టం చేశారు.

Similar News

News November 16, 2025

CII సదస్సు విజయవంతం: రాజన్

image

విశాఖపట్నం వేదికగా జరిగిన CII సదస్సు విజయవంతమైనట్లు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజన్ తెలిపారు. చిత్తూరులోని పార్టీ ఆఫీసులో ఆదివారం మాట్లాడారు. ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏపీ పారిశ్రామిక హబ్‌గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MP ప్రసాదరావు, ఎమ్మెల్యేలు నాని, మురళీమోహన్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు.

News November 16, 2025

కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

image

కర్ణాటక అత్తిబెలే సమీపంలో మిస్సయిన శ్రీనాథ్ డెడ్ బాడీ కుప్పంలో పూడ్చిపెట్టినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అత్తిబెలే వద్ద నివాసం ఉంటుండగా గత నెల 27 నుంచి కనబడడం లేదంటూ కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకుప్పం(M) ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.

News November 16, 2025

చిత్తూరు DRO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి బుధ, గురువారాల్లో HODలతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని DRO మోహన్ కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి గ్రీవెన్స్‌ల పరిష్కారంపై దృష్టిసారించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.