News March 26, 2025

రేపే ఉప ఎన్నికలు.. కూటమికి విజయం దక్కేనా.?

image

చిత్తూరు జిల్లా పరిధిలో బుధవారం MPP ఉప ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రామకుప్పం, తవణంపల్లి, సదుం, విజయపురం (వైస్ ఎంపీపీ), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి చూస్తోంది. సదుం సహా పలు చోట్ల YCP, కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు JC విద్యాధరి స్పష్టం చేశారు.

Similar News

News April 24, 2025

వైసీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం:రోజా

image

విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

News April 24, 2025

చిత్తూరు: DIEOగా శ్రీనివాస్ బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిగా ఆదూరి శ్రీనివాస్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈయన నెల్లూరు బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ రెగ్యులర్ పదోన్నతిపై DIEOగా చిత్తూరుకు వచ్చారు. అందరి సహకారంతో జూనియర్ కళాశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

News April 24, 2025

చిత్తూరు: ఒకేసారి తండ్రి, కుమార్తె పాస్

image

చిత్తూరు జిల్లా రొంపిచర్ల పంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. 1995-96లో 10వ తరగతి పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిలయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారారు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే తపనతో తన కుమార్తె బి.సమీనాతో కలిసి పదో తరగతి పరీక్షలు రాశారు. షబ్బీర్‌కు 319, కుమార్తె సమీనాకు 309 మార్కులు రావడం విశేషం.

error: Content is protected !!