News September 12, 2024
రేపే జొన్నవాడ ఆలయంలో టెండర్లు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ సందర్భంగా అలంకరణ పనులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు టెండర్లలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 28, 2025
నెల్లూరు మేయర్గా దేవరకొండ సుజాత..?

నెల్లూరు నగర మేయర్గా దేవరకొండ సుజాతను ఎంపిక చేసేందుకు టీడీపీ సిద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15లోగా ప్రస్తుత మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అనేక అంశాలను పరిశీలించి సుజాత పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈమె పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
News November 28, 2025
నెల్లూరు జిల్లాలో మార్పులు.. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా.?

జిల్లాలో 5 మండలాల డివిజన్ మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కందుకూరు డివిజన్లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాలను కావలి డివిజన్లో కలిపేలా నెల్లూరు డివిజన్లో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లా గూడూర్ డివిజన్లో కలిపేలా నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలుపాలని అధికారులు సూచించారు.
News November 28, 2025
అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి: జేసీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే షెల్టర్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


