News February 11, 2025

రేపే మేడారం జాతర..!

image

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.

Similar News

News September 16, 2025

రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా: కేటీఆర్

image

TG: సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారు ఘోరతప్పిదంతో SLBC టన్నెల్ కూలిందని, ఈ ఘటనలో ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని KTR మండిపడ్డారు. ‘హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి డెడ్ బాడీలను మూడు రోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటుందా? తమ ఆప్తులను చివరి చూపు చూసుకోలేని బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా?’ అని ప్రశ్నలు సంధించారు.

News September 16, 2025

నారాయణరావుపేట అత్యధిక వర్షపాతం

image

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణరావుపేట మండలంలో 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిరుదొడ్డి మండలంలో 87 మి.మీ, బేగంపేటలో 86 మి.మీ, రాంపూర్‌లో 82.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 38.3 మిల్లీమీటర్లుగా ఉంది.

News September 16, 2025

పాలకొల్లు: స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

image

పాలకొల్లులో సోమవారం బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన ఏలూరి శ్రీను మృతి చెందాడు. శ్రీను తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొబ్బరి వలుపు పని నిమిత్తం శ్రీను పాలకొల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.